ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

SANDHYA SAMAYAM

                                  సంధ్యా సమయం





అది వేసవి కాలం సాయంత్రం, గోదావరి తీరం,పక్షులు రోజంతా కలల వేటలో అలసిపోయి  తమ గూళ్ళకి చేరుకుంటున్న సమయం , సూర్యుడు కూడా ఇక సెలవు అంటూ టాటా చెపుతున్నాడు,
                       నేను గోదావరి నది ఒడ్డున కూర్చుని ఉన్న చల్లగా అలలపైనుండి గాలి వీస్తుంది అప్పుడే ఆమెను చూస
అదే మొదటిసారి కానీ ఎన్నో యుగాల అనుబంధంలా అనిపించింది, తన వంకే చూస్తూ ఉన్న అలా ఇంతలో తానే చూసింది , చిన్న చిరనవ్వుతో హలో అని  పలకరించింది, నేను హలో అన్న అలా పరిచయం అయ్యాము నేను సంధ్య .
                            ఇక రోజూ ఆ గోదావరి ఇసుక తిన్నెలె మా సంభాషణలకి సాక్ష్యాలుగా ఉన్నాయి, ప్రతి రోజూ చూసిన, చూసిన  ప్రతీ సారి ఎదో నూతన అనుభూతి కలిగేది. తనతో ఆ పరిచయమే నా ఈ చిరు సాహిత్యానికి నాంది అనుకుంటా, ఎప్పుడు నవ్వుతూ ఉండేది , ఎన్నో ప్రశ్నలు మరెన్నో చెలోక్తులు,సరదా సంభాషణలు ఇలా ఆ వేసేవి కాలం అందరికీ కొంచెం  కష్టం కలిగించినా నాకు మాత్రం మరచిపోలేని మధుర జ్ఞాపకాలు మిగిల్చింది.
                                       ఇక వేసవి సెలవులు అయిపోతున్నాయి , అదే మా చివరి సాయంత్రం, ఉదయం అయితే ఎవరి ఊరు కి వారు వెళ్ళిపోతాం , అయిన అదేంటో ప్రతి రోజు చకచక కబుర్లు చెప్పే తాను ఆ రోజూ మౌనంమే సమాధానంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నేను ఎమ్మాట్లడలో తోచలేదు, తన కళ్లలో మొదటిసారి చూస కన్నీళ్ళు  , తనని చూడడం కూడా అదే చివరి సారి , తన ఆచూకీ కోసం వేతకని చోటు లేదు .
                                     గడచిన ఆ సంధ్యా సాయంత్రాలు ఓ మధుర జ్ఞాపకాలుగా నా జీవితంలో మిగిలిపోయాయి, తన కోసం ఈ నిరీక్షణ ఎదో ఒక రోజు మజిలీ చేరుకుంటుంది అని ఓ చిన్న ఆశ.
               
                             

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మేల్కొలుపు

ఉదయమే కానీ శుభోదయం కాదు, సాంకేతిక పరిజ్ఞానం అంటూ ప్రకృతి తల్లికి  చేసిన గాయలెన్నో, అమ్మ ఒడిలో ఉంటూ  అందని చందమామ కోసం ఎన్నో ఆరాటాలు ,ఒడిలో లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మని కాదని కంటికి కనపడని గ్రహాల అన్వేషణలో కన్నతల్లికి చేసిన గాయలెన్నో,                                   ఎన్ని గాయాలు చేసిన అమ్మ మందలించిందే కానీ ఏనాడు దూరం చేయలేదు, కానీ ఈనాడు కరోనా  అనే మహమ్మారి వల్ల ఒక వైపు కాలుష్యం తగ్గి జీవన వైవిధ్యం విరాజిల్లుతోంది మళ్లీ అని సంతోష పడాలో లేక తాను పెంచిన పిల్లలు తనువుచాలిస్తు ఉంటే ఆ తనువులు తనలో కలుపుకొలేని నిస్సహాయత తలచుకుని అవేదన చెందుతుంది.                                  ఇకనైనా పుడమి తల్లి ఆవేదన అర్థం చేసుకుని ఆమె అశ్రువులను ఆనందబాష్పాలు గా మలచాలని కాంక్షిస్తూ .                                   ...