ఉదయమే కానీ శుభోదయం కాదు, సాంకేతిక పరిజ్ఞానం అంటూ ప్రకృతి తల్లికి చేసిన గాయలెన్నో, అమ్మ ఒడిలో ఉంటూ అందని చందమామ కోసం ఎన్నో ఆరాటాలు ,ఒడిలో లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మని కాదని కంటికి కనపడని గ్రహాల అన్వేషణలో కన్నతల్లికి చేసిన గాయలెన్నో, ఎన్ని గాయాలు చేసిన అమ్మ మందలించిందే కానీ ఏనాడు దూరం చేయలేదు, కానీ ఈనాడు కరోనా అనే మహమ్మారి వల్ల ఒక వైపు కాలుష్యం తగ్గి జీవన వైవిధ్యం విరాజిల్లుతోంది మళ్లీ అని సంతోష పడాలో లేక తాను పెంచిన పిల్లలు తనువుచాలిస్తు ఉంటే ఆ తనువులు తనలో కలుపుకొలేని నిస్సహాయత తలచుకుని అవేదన చెందుతుంది. ఇకనైనా పుడమి తల్లి ఆవేదన అర్థం చేసుకుని ఆమె అశ్రువులను ఆనందబాష్పాలు గా మలచాలని కాంక్షిస్తూ . ...
సంధ్యా సమయం అది వేసవి కాలం సాయంత్రం, గోదావరి తీరం,పక్షులు రోజంతా కలల వేటలో అలసిపోయి తమ గూళ్ళకి చేరుకుంటున్న సమయం , సూర్యుడు కూడా ఇక సెలవు అంటూ టాటా చెపుతున్నాడు, నేను గోదావరి నది ఒడ్డున కూర్చుని ఉన్న చల్లగా అలలపైనుండి గాలి వీస్తుంది అప్పుడే ఆమెను చూస అదే మొదటిసారి కానీ ఎన్నో యుగాల అనుబంధంలా అనిపించింది, తన వంకే చూస్తూ ఉన్న అలా ఇంతలో తానే చూసింది , చిన్న చిరనవ్వుతో హలో అని పలకరించింది, నేను హలో అన్న అలా పరిచయం అయ్యాము నేను సంధ్య . ఇక రోజూ ఆ గోదావరి ఇసుక తిన్నెలె మా సంభాషణలకి సాక్ష్యాలుగా ఉన్నాయి, ప్రతి రోజూ చూసిన, చూసిన ప్రతీ సారి ఎదో నూతన అనుభూతి కలిగేది. తనతో ఆ పరిచయమే నా ఈ చిరు సాహిత్యానికి నాంది అనుకుంటా, ఎప్పుడు నవ్వుతూ ఉండేది , ఎన్నో ప్రశ్నలు మరెన్నో చె...